31
Aug2017
మౌనానికి ఎన్నో ముఖ చిత్రాలు ( various faces of silence )

పూల రేకుల లాలిత్యాన్ని మరపిస్తుంది
కత్తి అంచు కాఠిన్యాన్ని తలపిస్తుంది
తృణీకార సందేశానికి ప్రతీక అవుతుంది
కత్తి అంచు కాఠిన్యాన్ని తలపిస్తుంది
తృణీకార సందేశానికి ప్రతీక అవుతుంది
ఖేదాన్ని మోదాన్ని
రాగాన్ని ద్వేషాన్ని
సుఖాన్ని దుఃఖాన్ని
విషాన్ని మాధుర్యాన్ని… భాషాంతరీకరిస్తుంది.
రాగాన్ని ద్వేషాన్ని
సుఖాన్ని దుఃఖాన్ని
విషాన్ని మాధుర్యాన్ని… భాషాంతరీకరిస్తుంది.
పలుకుది శబ్ద భాషణ, మౌనానిది నిశ్శబ్ద భాషణ.
అనుచిత సంభాషణను తుంచి వేయగల మందు మౌనం.
Finally మౌనేన కలహం నాస్తి.
========================================
భాషాంతరీకరణ = Expressing in a different language
తృణీకారము = Neglect
ప్రతీక = Symbol
ఖేదము = grief
మోదము = Happiness
రాగము = Affection
అనుచిత = Improper